User talk:Pavani Muneendra Babu

Page contents not supported in other languages.
From Wikipedia, the free encyclopedia

This is an old revision of this page, as edited by Pavani Muneendra Babu (talk | contribs) at 02:18, 25 April 2024. The present address (URL) is a permanent link to this revision, which may differ significantly from the current revision.

వీరు 1967 వ సంవత్సరంలో , జూన్ 1 వ తేదీన సనాతన కుటుంబంలో శ్రీమతి & శ్రీ మధుసూదనరావు గారు, కృష్ణవేణమ్మ గ్రామ పుత్రులుగా పొట్టి పల్లి గ్రామం, కొండాపురం మండలం, ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు..

వీరు అంచెలంచెలుగా ఎదుగుతూ, భారతదేశ రక్షణ రంగంలో వీరికంటూ ఒక ఉన్నతమైన స్ధానం ఏర్పరుచుకున్నారు. వీరు మంచి నటులు, కవి, సంఘ సేవకులు, సామాజికవేత్త. భారత రక్షణ రంగంలో లడఖ్ నుండి అండమాన్ దాకా వివిధ శాఖలలో వీరి సేవలు గణనీయమైనవి. మునీంద్రబాబు గారు మొదటినుండి పౌర వ్యవహారాలలో ఎక్కువ ఆసక్తి వుండటం వలన సమాజ సేవ చేయటానికి ఉత్సాహ పడేవారు..

దేశభక్తి, సేవాతత్పరత కలిగిన మునీంద్రబాబు గారు చదువుకునే రోజుల్లోనే తన తోటి విద్యార్థులకి ఆసటగా నిలిచేవారు. వీరి శిష్య వర్గంలో అనేకులు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా ఖ్యాతి గడించారు. సంస్కృతం, ఆంగ్లంలో ప్రావీణ్యులు అవటం వలన మునీంద్రబాబు గారు పలు ప్రముఖ పత్రిక లకు రచనలు చేసి సమాజానికి ఒక స్ఫూర్తి నిచ్చారు...

వీరికి రక్షణ రంగం నుండి Life Time Achievement అవార్డు లభించింది. NCC లో వీరి సేవలు గణనీయమైనవి. వీరి జీవిత విధానమత్యంత క్రమబద్ధమైనది. వీరు విద్యా తపోనిధిగా ఎంతోమంది శిష్యులకు అక్షర దానం చేసిన దాత వీరు. వీరెవ్వరినీ అధిక్షేపించినట్లు, ఎవ్వరి తో గానీ వాదమునకు పూని నట్లు వీరి జీవితంలో కానరాదు. మునీంద్రబాబు గారికి అనేక రంగాలలో విశేషమైన ఆదరణ, గుర్తింపు లభించింది.

ఆధ్యాత్మిక జ్ఞానోదయం మరియు గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం వీరు Mogilicharla గ్రామంలో సాయిబాబా మందిరాన్ని నిర్మించి, తల్లితండ్రుల ఋణం, గ్రామ ఋణం లేకుండా చేసుకున్న మహోన్నతమైన వ్యక్తి మన మునీంద్రబాబు గారు.

తెలుగు భాషకు, తెలుగు జాతికే కాకుండా యావత్ భారత దేశానికి వీరు ఎన్నో చిరస్మరణీయమైన సేవలను అందించి, భారత ప్రజలకు ఎంతగానో తోడ్పాటును అందించిన మునీంద్రబాబు గారు నిండు నూరేళ్లు, సుఖసంతోషాలతో, ఆయుఃఆరోగ్యాలతో చిరస్మరణీయులుగా జీవించాలని మనసారా కోరుకుంటూ.....