Jump to content

User:Alabanahari

From Wikipedia, the free encyclopedia

1.ఆయన ఓ గురువు. చిత్రకారుడు కూడా. ఆయన ఓ బొమ్మ గీస్తున్నారు. దగ్గరలోనే ఓ శిష్యుడు నిల్చుని చూస్తున్నాడు. అంతేకాదు, మధ్యమధ్యలో అతను విమర్శిస్తున్నాడు కూడా. గురువుగారు ఎలాగైతేనేం బొమ్మ గీశారు. అదేమంత గొప్పగాలేదు. ఇద్దరిలోనూ దిగులు. దేనినైనా చక్కగా చేసే తన గురువు ఈరోజు ఎందుకు సరిగ్గా గీయలేదు? ఆయనకు ఏమైంది? అని ఆలోచించాడు శిష్యుడు. గురువు కూడా రకరకాలుగా ఆలోచించి గీసినా అదేమంత చక్కగా అమరలేదు. ఆయన దిద్దేకొద్దీ అది మరింత పిచ్చిగా తయారవుతోంది. శిష్యుడు బొమ్మ బాగులేదని చెప్తూ వచ్చాడు. చివరికి వర్ణాలన్నీ అయిపోయాయి. ‘‘వెళ్లి కాస్త వర్ణాలు తీసుకురా....’’అని చెప్పారు గురువు శిష్యుడితో. శిష్యుడు లేచి వెళ్ళాడు. గురువు తనదగ్గరున్న కుంచెలను మారుస్తున్నారు. కాసేపటికి శిష్యుడు వచ్చాడు. శిష్యుడికి ఆశ్చర్యం వేసింది. బొమ్మ పూర్తి అయిపోయింది. అద్భుతంగా ఉంది. ‘‘గురువుగారూ! బొమ్మ చాలా గొప్పగా ఉంది...’’ అన్నాడు ఆనందంతో. గురువు నవ్వుతూ ‘‘నువ్వు ఇక్కడే ఉండటంతో ఆ సమస్య తలెత్తింది. నువ్వు చూస్తున్నావు అనే విషయం నన్ను ఏదో చేసింది. ఆ భావంతోనే బొమ్మ సరిగ్గా రాలేదు. పక్కన విమర్శించే ఓ మనిషి ఉంటే ఏ సృష్టీ సరిగ్గా రాదు. మనసులో ప్రశాంతత ఉండదు. ఆత్మ ప్రశాంతంగా లేకుంటే సృష్టిలో క్రమం తప్పుతుంది. పూర్ణత్వం రాదు... నువ్వు వెళ్ళిపోయావు. నాలో నాపై ఉన్న నిషేధం, ఒత్తిడి పోయాయి. ఆ స్థితిలో చిత్రం చక్కగా రూపుదిద్దుకుంది. పూర్ణత్వం ఏర్పడాలనే తలపే అపూర్వాన్ని పుట్టిస్తుంది. మనస్సుని నిండుగా అర్పించినప్పుడు లోటుపాట్లు పటాపంచలవుతాయి. అందుకే అంటున్నా, లోటు అనేదే ఓ లోపం. అది ఉన్నంతవరకూ ఏదీ పూర్ణం కాదు. అర్ధమనస్సుతో ఏదీ చేయకూడదు. సహజత్వం అనేదే పూర్ణత్వం. సహజంగా చేసేదేదైనా పరిపూర్ణమే’’ అన్నారు.

2.బాగా ఆశ కలిగిన మిడిల్ క్లాసు వ్యక్తి . . తన సంపాధనతో బ్రతకగలిగినా . . . . తన రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు దగ్గరకి వెళ్ళి తన అసంతృప్తి తెలియజేసాడు . . " ఓ రాజా నీ దగ్గర అంతులేని సంపద ఉంది మాలాంటి వారికి ఇస్తే అరిగేనా తరిగేనా . . అంటూ నిరుస్తాహంగా మట్లాడుతూ రాజు గారికి కొరకరాని కొయ్యగా మారాడు . . " విషయం అర్ధం చేసుకున్న రాజు . . మరుసటి రోజు ఉదయాన్నే వస్తే తనకి కొంత భూమిని ఇస్తా అని చెప్పి పంపాడు . . : - ) అనుకున్న విధంగానే రాజు దగ్గరకు వచ్చాడు ఆ వ్యక్తి . . రాజు . . అతనితో . . ఒక భూమిని చూపించి . . నువ్వు పరిగెత్తినంత దూరం పరిగెత్తు . . . ఎంత దూరం వెళ్ళి . . తిరిగి వస్తావో . . అంతా . . నీకే చెందుతుంది అని చెప్పాడు . . . అతను పరుగు మొదలు పెట్టాడు . . ఆకలి . . దప్పికలు కూడా లెక్క చేయకుండా . . . పరిగెడుతున్నాడు . . . మధ్యహ్నం అయింది . . రాజు గారి కండిషన్ గుర్తొచ్చింది . . . తిరిగి రాజు గారిని చేరాలని . . . ఇంకా పరిగెడితే ఇంకొచేం భూమి తనదవుతుందని ఆశ . . . అది అత్యాశ అయింది . ఒంట్లో ఓపిక కొంచేం కొంచేం తగ్గుతుంది . . . సాయంకాలం కావొస్తుంది . . . : - O ఇంక చాలు . . అనుకుని . . తిరిగు పరుగు ప్రారంభించాడు . . కాని ఒంట్లో అస్సలు ఓపిక లేదు . . . సగం దూరం వచ్చేసరికి సూర్యాస్తమయం అయిపోతుంది . . . పరుగులో వేగం పెంచాడు . . . కాని . . నీరసం వలన . . . రాజుని దగ్గర వచ్చే సరికి కళ్ళు తిరిగి పడిపోయాడు . . . బలహీనతతో ప్రాణాలు వదిలేసాడు . . . ఆశ అనేది మనిషి జీవితాన్ని నడిపే ఇందనం . . . మోతాదు మించితే అదే విషం . . అందుకే అత్యాశ అరోగ్యానికి హానికరం అంటారు . .

3. ఒకసారి సముద్రుడికి పెద్ద సందేహం వచ్చింది . గంగానదిని అడిగాడు , నువ్వు నా దగ్గరకు పెద్ద పెద్ద చెట్లను మొసుకొస్తుంటావు కదా , గడ్డి పరకల్ని ఎందుకు తీసుకురావు అని . అప్పుడు గంగానది ఇలా సమాధానం చెప్పింది . చెట్లు వంగవు . అవి కఠినంగా ఉంటాయి . అందుకే వాటిని వేళ్ళతో సహా పెళ్ళగిస్తూ ఉంటాను . గడ్డిపరకలు వేరు . వాటికి ఆణుకువ తెలుసు . నేను మహోధృతంగా ప్రవహిస్తున్నప్పుడు నా వేగానికి , బలానికీ అవి వినయంగా తలవంచుతాయి . అప్పుడు నా వేగమూ , శక్తీ ఓడిపోతాయి . నా వరద తగ్గిన వెంటనే గడ్డిపరకలు మళ్ళీ తలెత్తుతాయి . అలాగే ఇతరులతో సర్దుకోవడం చేతకాక అహంకారంతో , అతిశయంతో మిడిసిపడేవారు తమకంటే బలమైన శక్తులకు ఓడిపోయి నశిస్తారు . వినయంతో , ఇతరులతో సామరస్యభావనతో జీవించేవారు ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకుంటూ పదికాలాల పాటు జీవిస్తారని చెబుతుంది మహాభారతంలోని ఈ ఉదాహరణ.