User:Nataratna abhimani
పుచ్చకాయల చంద్రమౌళి
ఓ వీరాభిమాని కట్టిన ఎన్టీఆర్ గుడి
ఎవరైనా ఇల్లు కట్టుకుంటే అ ఇంటికి తమ పేరు పెట్టుకుంటారు. లేదా తల్లిదండ్రుల పేర్లు పెడతారు. మరికొందరు తమ ఇష్టదైవాల పేర్లు పెట్టుకుంటారు. కానీ , కాకినాడ సమీపములోని వలసపాకల గ్రామానికి చెందిన పుచ్చకాయల చంద్రమౌళి మాత్రం తమ ఇంటి పేరు ను 'తారకరామ నిలయం' గా పెట్టుకున్నారు. బాల్యం నుంచి ఎన్టీ రామారావు అభిమాని. తను పూజించే దేవుళ్ళ లో రామారావును చూసుకునేవారు. చిన్నతనంలోనే రామారావు డైలాగులు, డ్యాన్సులు, పాటలు చంద్రమౌళికి వెన్నతో పెట్టిన విద్యగా మారాయి. చంద్రమౌళి ఉద్యోగంలో చేరిన తరువాత రామారావు మీద ఉన్న అభిమానంతో ఆయన నటించిన సినిమాల్లోని రాముడు,కృష్ణుడు,వేంకటేశ్వరస్వామి ఫోటోలను సేకరించారు. అంతేగాకుండా పదహారు సంవత్సరాలుగా రామారావు నటించిన 240 సినిమాల సీడీలను సేకరించారు.
హైదరాబాదు, బెంగుళూరు,చెన్నై నగరాలకు వెళ్లి ఒరిజినల్ సీడీలను తెచ్చారు. రామారావు సినిమాలు చూసి ఆనందించడమే కాకుండా, పది మందికి చూపించాలనే తపన ఉంది. తాను నిర్ముంచుకున్నతారకరామ నిలయంలో మూడో అంతస్తులో ఒక గది కి నటరత్న కళామందిర్ గా నామకరణం చేసారు. ఇందులో ఎన్టీ రామారావు చిత్రాల సీడీలను, ఫోటోలను ప్రదర్శనకు అనుకూలంగా ఉంచారు. తన ఇంటిలోని మందిరానికి గుడిగంటలు, పడక గదులకు మనుషుల్లో దేవుడు, బడి పంతులు, శ్రీ కృష్ణావతారం, కలిసివుంటే కలదు సుఖము. వంటగదికి రాముడు-భీముడు పేర్లు పెట్టారు. చంద్రమౌళి చేస్తున్న సేవకు గుర్తింపుగా ఇండియా బుక్ అఫ్ రికార్డులో స్థానం లబించింది. సిని నటుడు బాలకృష్ణ ఇటివల చంద్రమౌళి ని సత్కరించారు.
ఘంటసాల కుమారుడు ఘంటసాల రత్నకుమార్ తారకరామ నిలయాన్ని సందర్శించి చంద్రమౌళి ని అభినందించారు. చంద్రమౌళి తమ అభిమాన నటుడు రామారావు సినిమాల్లోని మాటలను, పాటలను చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం సొంత డబ్బును ఖర్చు చేస్తున్నారు. రామారావు ఫై చంద్రమౌళికి ఉన్న అభిమానాన్ని పలువురు మెచ్చుకున్నారు.
పుచ్చకాయల చంద్రమౌళి. ఓఎన్‌జీసీ లో అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్‌గా ఉద్యోగం. ఇష్టం, అభిమానం, భక్తీ అన్నీ నటరత్న నందమూరి తారకరామారావు మీదే. రామారావు నటించిన సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో నటవిశ్వరూపాన్ని చూసి కురుక్షేత్ర సంగ్రామం సమయంలో కృష్ణుని విశ్వరూప సందర్శన భాగ్యాన్ని పొందిన అర్జునుడిలా ఆనందపడిపోతూ ఆస్వాధించడం, ఆ మహానటుని డైలాగులు వింటూ మురళీగానాన్ని విన్న బృందావన వాసిలా తన్మయత్వం చెందడం ఈయన అభిరుచులు.