Jump to content

User:Rti ganesh

From Wikipedia, the free encyclopedia

[1] GEDDANAPLLI HISTORY Cite error: There are <ref> tags on this page without content in them (see the help page).

ఏలేశ్వరం ప్రాంతం ప్రజలు సామర్లకోట, కాకినాడ, రామచంద్రపురం లేక కోనసీమ వైపుగా వెళ్ళేటప్పుడు ఆ రోజులలో (1820 కాలంలో) రోడ్లు, బస్‌లు లేనందున ఎడ్ల బండ్లలో ప్రయాణించవలసి వచ్చేదట. బళ్ళులో ప్రయాణించటానికి వీలుపడని గ్రామాలు కూడా ఉండేవట. అప్పుడు ఏలేశ్వరం నుంచి అద్దె జట్కా(గుర్రపు బండ్స)లో ఎర్రవరం వరకు వచ్చి అక్కడ దిగిపోయి నడక మార్గాన గెద్దనాపల్లి వచ్చి అక్కడ నుంచి ఏటి గట్టున నడిచి రామకృష్ణాపురం (రాజుపాలెం) చేరుకుని అక్కడ నుంచి దివిలి వరకు వెళ్ళి జట్కా బళ్ళలో సామర్లకోట చేరుకొని అక్కడ నుంచి కాకినాడ

వెళ్ళే జట్కా బళ్ళు ఎక్కేవారట. ఈ విధంగా ఏలేశ్వరం నుంచి, ఆ పైనుంచి వచ్చే ప్రయాణీకుల కోసం పంతం దొరయ్యగారి తండ్రి వెంకటచలంగారు గెద్దనాపల్లిలో ఒక సత్రాన్ని ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించేవారట. ఈ సత్రాన్ని పంతం వారి సత్రం అని పిలిచేవారట. రోడ్లు, రావాణా సౌకర్యాలు మెరుగు పడడంతో ఈ సత్రం ఉపయోగం తగ్గిపోయిందట. ఆ సత్రాన్నే వెంకటచలం, తమ్మన్న గార్ల మధ్య వివాదాలు ఏర్పడినప్పుడు వెంకటచలం గారు స్వాధీనం చేసుకొన్నారు. దానినే మునసబు గారి ఇల్లు అనేవారు. ఆ ఇంటిని తర్వాత అమ్మివేయగా పంతం

శ్రీరాములు గారు (వెంకయ్య గారి అబ్బాయి) కొన్నారు.

                         బహుశా గెద్దనాపల్లిలో పురాతనమైన గుడి అంకాలమ్మ గుడియే. దీనిని దొరయ్య గారు తండ్రి వెంకటచలం గారు నిర్మించినట్లు చెప్పబడుతుంది. అప్పుడు ఈ గుడి నిర్వహణ నిమిత్తం రెండు ఎకరాలు ఇచ్చేరట. ఈ గుడి ఆవరణలోనే పోతిరాజు గుడి ఉండేది. అయితే పోతిరాజు గుడి శిధిలమైన స్థితిలో ఉండేది. పోతిరాజు గ్రామ దేవతలందరు తమ్ముడు అని చెప్పేవారు. పంతం పద్మనాభం గారదవరాయళా మంత్రిగా ఉన్నప్పుడు శిథిలమైన పోతిరాజు గుడిని త్రాలగించ్చి అంకాలమ్మ గృడిని వున: నిర్మించేరు. ఈ గుడిని అన్నవరం దేవస్థానం వేణుగోపాలస్వామి ఆలయంతో

పాటు దత్తత తీస్కోన్న విషయం అందరికి తెలుసున్న విషయమే.అంకాలమ్మ లేక అంకాళమ్మా పేరు సరైనదా అంటే “అంకాళమ్ను" ప్రేరే సరైన పేరు తిరుపతి నుంచి అలిమేలు మంగాపురం వెళ్ళేరోడ్‌లో ఒక చోట గుడి కనబడుత ఆ గుడిముందు బోర్డుపై “అంకాళ్ళమ్మ వారి గుడి" అని రాస యున్నది. కాళ్లి అవతారాలలో అంకాళమ్మ ఒక అవతారం, ఈ కారణంచే తిరుపతిలో రాసినట్లు

అంకాళమ్మ (పేరులో 'ల'కు బదులు 'ళ అక్షరంతో ఆ దేవత సరైన పేరు).గెద్దనాపల్లిలో వేణుగోపాలస్వామి పూర్వ చరిత్ర చాలా మందికి తెలీదు. పంతం వెంకయ్యగారు కుటుంబ పెత్తనం చేస్తున్నప్పుడు ఆయన దగ్గర కూర్చుని కబుర్లు చెప్పేవారు. “మన ఊరిలో ఒక దేవాలయం ఉండాలండి” అని అంటూ ఉండేవారు.వీళ్లు తరచు ఈ ప్రశక్తి ఎత్తుతున్నా వెంకయ్యగారు విని ఊరుకోవటమే గాని ఏమి చెప్పేవారు కాదట. ఆయన అలా మౌనంగా ఉండటానికి ఒక కారణం ఉండేదట.ఒక దేవాలయం ఉండాలంటే పంతం వారి వీధి ఎదురుగానే ఉండాలి, అప్పటికి పంతం వారి వీధికి ఎదురుగా రామకోవెల ఉండేదట. రామకోవెల వెనుక అంతా చెరువేనట. ఇక గుడికి స్థలం ఏది అని ఆయన అనుకొంటూనే ఉండేవాడట.వెంకయ్యగారి వద్ద కూర్చుని గుడి గురించి మాట్లాడేవాళ్ళంతా రహస్యంగా ఒక షాన్‌ వేసేరట. వెంకయ్యగారిని గుడి కట్టించాలాగున చేయాలంటే ఏమి చేయాలా అని.ఈ జట్టులో బుర్రి కామరాజు గారు (చంద్రన్న గారి తర్వాత వాడు) మిగతా వాళ్ళకు ఒక ఉపాయం చేప్పేడట. ఎవరికి తెలియకుండా పంచలోహంతో చేసిన కృష్ణుని విగ్రహం చేయించి రోడ్డు ప్రక్కన ఉన్న పెద్ద నూతిలో పడవేయాలి. ఆ విషయం ఉర్గో వాళ్ళకు ఎవరికి తెలియకూడదు, అప్పుడు “నేను నూతిలో వెలసేను, నన్ను బయటకు తీసి నాకు గుడి కట్టించాలి" అని శివం ఎక్కినట్లు నటి&ించాలి అని చెప్పగానీ ఉపాయం బాగానే ఉంది, అలాగే చేద్దాం అని అందరూ అనుకొన్నారట. అయితే పిల్లికి

ఎవరు గంట కడతారు అనే సామెతలాగ విగ్రహం ఎవరు చేయిస్తారు, దానికి అయ్యే ఖర్చుకు డబ్బు ఎలా అనే ప్రస్తావన వచ్చిందట. వాళ్ళు కాకినాడలో చదువుకొంటున్న మా నాన్నగారు (పెద్ద దొరయ్యగారు) గుర్తుకు రావటంతో ఈ పని పెద్ద అబ్బాయితోనే చేయించాలి అని అనుకొన్నారుట. మా నాన్నగారు శెలవు రోజులలో గెద్దనాపల్లి రాగా ఈ జట్టు వాళ్ళు మా నాన్నగారుతో రహస్యంగా ఈ విషయం చెప్పేరట. అప్పుడు నాన్నగారుకు ఇరవై సంవత్సరాలట. వాళ్ళు చెప్పింది ఎందుకో ఆ పని చేయించాలి అనే ఉత్సాహం కలిగిందట. కాకినాడ తిరిగి వెళ్ళి తర్వాత మా నాన్నగారికి తెలుసున్న ఎవరితోనో బంగారు పని చేసే కొట్టువాళ్ళను కలిసి పంచలోహంతో కృష్ణుని విగ్రహం చేయటానికి మాట్లాడితే ఆ సైజు విగ్రహం చేయటానికి సుమారు ఇరవై అయిదు రూ.లు అవుతుండి. అడ్వాన్స్‌గా పది రూ.లు పుచ్చుకొని పదిరోజులలో రమ్మన్నారట. అలాగే పది రోజులలో విగ్రహం తయారు చేయగా, మిగతా పదిహేను రూ.లు వాళ్ళకు ఇచ్చివేసి, ఆ విగ్రహాన్ని ఒక సంచిలో పెట్టి, సాయంత్రం ఏడు గంటల సమయంలో బండిలో సామర్లకోట చేరుకొని అక్కడ ఒక బండిని గెద్దనాపల్లిలో దింపటానికి మాట్లాడుకుని (ఆరోజులలో బస్‌లు లేవు) గెద్దనాపల్లి చేరేసరికి రాత్రి పది గంటలు

అయిందట. అప్పుడు గెద్దనాపల్లికి ఉన్న ఈ పెద్ద నుయ్యి ఊరు కొసనున్నట్లు ఉం డేదట. అప్పుడు గెద్దనాపల్లికి రోడ్డు లేదట. మా నాన్నగారు విగ్రహంతో వచ్చిన బండి పుంత మార్గాన వచ్చిందట. చీకటి రాత్రలయందు ఒక మనిషి కూడా అనుయ్యి ఉండే ప్రాంతానికి వచ్చేవారు కాదట. నూతి సమీపంలో మా నాన్న గారు నంచితో బండి దిగిపోతే మిమ్ములను ఇంటి దగ్గర దింపేస్తాన్స తక.

దిగిపోయారేంటని ఆ బండివాడు అనగా ఎవరుకు తెలియకుజడా ఆ ల న! నూతిలో పడివేయాలి అని మా నాన్నగారు ఉద్దేశం, మా నాన్నగారు పట్టుకు దిగిన సంచి ఏమిటో, సంచిలో ఏముందో ఆ బండి వానికి తెలీదు. ఇక్కడ ఎవరికో ఏద్దో పని పురమాయించవలసియున్నది. నీకు ఇప్పటికే ఆలశ్యం అయిపోయింది. నీవు వెళ్ళిపోమంటే ఆ బండివాడు తిరిగి వెళ్ళిపోయేడట. అప్పుడు మా నాన్నగారు సంచిలోంచి త్రీ కృష్ణుని విగ్రహాన్ని తీసి నూతిలో వదిలేద్దామని నూతిని సమీపిస్తే ఏదో భయం కలిగిందట. ఆ విగ్రహాన్ని నూతిలోకి వదిలేయగానే విగ్రహం నీటిలో పడిన శబ్దం పెద్దగా చప్పుడు అయిందట. అక్కడ నుంచి వచ్చేసి ఆ ఉదయం మా నాన్నగారు ఇలా చేయమని పురమాయించి వాళ్ళకు చెప్పగా ఈ సంగతి ఎవరుతో కూడా చెప్పవద్దన్నారుట. మా నాన్నగారు కాకినాడ వెళ్ళిపోయేరుట. ఈ పదకం పన్ని వాళ్ళతో రహస్యంగా సమావేశమైనారట. వాళ్ళు ష్లాన్‌ వేసినట్లే బుర్రి కామరాజు గారు “నేను నూతిలో వెలసేను, నన్ను పైకి తీసి నాకు గుడి కట్టించండి" అని శివం ఎక్కినట్లు మాట్లాడటం ప్రారంభించేడట. ఈ జట్టులో ఒకరు వెంకయ్యగారి వద్దకు వచ్చి బుర్రి కామరాజు గారు శివం ఎక్కి “నూతిలో వెలసేను, నన్ను బయటకు తీసి నాకు గుడి కట్టించాలి" అంటున్నాడు అంటే వెంకయ్యగారు నిజం శివం ఎక్కటమా,దొంగ శివం ఎక్కటమా అని అనగా మరొకరు ఎవరో వచ్చి “నేను నూతిలో వెలనేను...”బుర్రి కామరాజు పాట పాడుతున్నాడండి అని చెప్పుతుంటే, ఆ బట్టలో మిగతావాళ్ళు కూడా వచ్చి, నూతిలో నీరు అంతా తోడించేస్తే ఆయనది దొంగ శివమౌ, నిమజో తేలిపోతుంది గదా అంటే వెంకయ్యగారు కూలీలను పెట్టీ నీరు తొడించేయమని

పురమాయించారు. ఆ రోజులలో ఆ నూతిలో నీళ్ళనే ఊరులో వాళ్ళు మంచినీళ్ళగా త్రాగటానికి వాడేవారు.ఆ నూతిలో నీరు అంతా తోడుతుంటే, ఇక నాల్గు అడుగులు నీరు మాత్రమే మిగిలి జ

౦దనగా నూతి అడుగున ఉన్న శ్రీ కృష్ణ విగ్రహం స్పష్టంగా పైన ఉన్నవాళ్ళకు కనబడుతుంటే ఎవరో నూతిలోకి దిగి ఆ విగ్రహాన్ని నూతి నుంచి బయటకు తేగా వెంకయ్యగారికి అదొక అద్భుత విషయంగా బావించేరట. ఆ విగ్రహాన్ని వెంకయ్య గారు ఒక గదిలో ఉంచి లక్ష్మి నర్సాపురం జమిందారిణి చల్లయమ్మరావు గారికి విగ్రహాన్ని చూడటానికి గెద్దనాపల్లి రమ్మని కబురు చేసేరట. ఆవిడ ఒకరోజు శదయమే గెద్దనాపల్లి వచ్చి ఆ విగ్రహాన్ని చూసి “మీరు గుడి ఎక్కడ నిర్మిందామని అనుకొంటున్నారో నిర్ణయించి నాకు తెలియజేయండి. గుడి నిర్మాణానికి నా వంతుసహాయం చేస్తాను” అని ఆవిడ వాగ్గానం చేసిందట. గెద్దనాపల్లిలో నూతిలో వేణుగోపాలస్వామి వెలసేడట. ఆ విగ్రహాన్ని పంతం వారు ఇంట్లే ఉంచేరట అన్న వార్త చుట్టు ప్రక్కల గ్రామాల వాళ్ళకి తెలినీ ఆ విగ్రవోన్ని చూడాలని తండోపతండాలుగా జనం వచ్చి విగ్రహాన్ని చూసి దణ్ణం పెట్టుకొని వెళుతుండేవారట. పంతం వారి తరపున గుడి నిర్మాణం కోసం పదివేల రూపాయలు వెంకయ్యగారు కేటాయించేరట. ముందుగా పంతం వారి వీధి ఎదురుగా ఉన్న రామకోవెలను బ్రహ్మాణ వీధి ఎదురుగా కట్టించేరట. (ప్రస్తుతం ఉన్న రామకోవెల స్థానంలో). అప్పుడు ఆ బ్రాహ్మణ వీధిలో అయిదు ఇళ్ళ పేర్లగల బ్రాహ్మణులు ఉండేవారు. అందుచే ఆ వీధిని బ్రాహ్మణ వీధి అనేవారు. పంతం వారి వీధి ఎదురుగా ఉన్న చెరువు బాగాన్ని మట్టితో పూడ్చి ఆ చెరువు ముందు భాగాన్ని సమతలం చేసి అందులో ఎక్కడ నుంచో తెప్పించిన కొండరాళ్ళును చెక్కించి గుడి నిర్మాణ పంతం వెంకయ్యగారుతో కొబ్బరికాయ కొట్టించి ప్రారంభించేరట. ఈ గుడి నిర్మాణాన్ని లక్ష్మినర్సాపురం జమిందారిణి చెలయమ్మరావు గారు కూడా ధన సహాయం చేయటంతో పాటు, పెద్దాపురం వైశ్యులు చుట్టు ప్రక్కల ర్రామాల వాళ్ళు ఎవరుకు వాళ్ళు వాళ్ళను అడగకుండానే డబ్బు తీసుకొచ్చి గుడి నిర్మాణంలో ఉపయోగించమని వెంకయ్యగారికి ఇస్తుండేవారట. త్ర విధంగా నడి నిర్మాణం 1917కు పూర్తి చేసి ప్రతి సంవత్సరం శ్రీ రక్షిజీ వేడుగోపాలస్యాని కళ్యా సందర్భంగా తీర్ధం జరుపుతుంటే ఆ తీర్థంలో పాల్గొనుటకు చుట్టు ప్రక్క గ్రామాలన్తంచి జనం వస్తుండేవారట. ఈ గుడిలో పూజలు నిర్వహించటానికి గుది మెళ్ళ నరసింహాచార్యుల గారి కుటుంబీకులను నియమించేరు. చెరుపు గర్భంలో ఈ గడి కట్టియున్నందున 1946వ సంవత్సరానికి గుడి బీటలు వారింది. గుడి మండపం ఎప్పుడు కూలిపోతుందో ఏమిటో అని ఆ గుడి మండపంలోకి వెళ్ళేవాళ్ళకు ప్రమాదం జరగవచ్చని మా తాతయ్య గారు (సుబ్బయ్యగారు మండపం అంతయు మూడు అడుగులు ఎత్తు మట్టి పోయించి మండపంను దింపించేశారు.

                               44 సంవత్సరాల అనంతరం అప్పటి రాష్ట్ర దేవదాయ శాఖా మంత్రిగా ఉన్న సాగి సూర్యనారాయణ రాజు గారిని పంతం పధ్మనాభం (ఎమ్‌. ఎల్‌.ఎ) గారు 1989లో

మంత్రి గారిని గెద్దనాపల్లి తీసుకు వచ్చి గుడి విప్పేసిన స్థలం చూపగా ఆ మంత్రి గుడి స్థలాన్ని చూసి వెళ్ళిపోవటం తప్ప చేసింది ఏమిలేదు. ఆ తర్వాత పద్మనాభం గారి ఫ్రెండ్‌ నేదురుమల్లి జనార్ధన రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వటం పంతం వధ్మనాభంగారిని తన మంత్రి వర్గంలో రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రిగా నియమించటం, పధ్మనాభం గారు గెద్దనాపల్లిలో (వాస్తు ప్రకారం) స్థల మార్పు

చేయించి శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాలస్వామి గుడి కట్టించటం, గుడి సంప్రోక్షం చిన జీయరు స్వామి చేయటం ఆ సమయంలో ముఖ్యమంత్రి గెద్దనాపల్లి రావటం అందరికి తెలుసున్న విషయమే.

                         1917లో నిర్మించబడిన గుడికి చెక్కిన రాళ్ళలో నిర్మిస్తే 1994లో నిర్మించబడిన కొత్తగుడి అంతా కాంక్రీట్‌ పని. 1917లో రాళ్ళతో నిర్మించబడిన ఆ పాత గుడికీ ముప్పై అయిదు (35000) వేల రూపాయలు అయితే 1994లో పూర్తి కాంక్రీట్‌ గుడికి ముప్పెలయిదు లక్షల వ్యయం అయింది. గుడిలో విగ్రహాలను మాతు తిరుమల తిరుపతి దేవస్థానం సబ్సిడీ రేటుతో ఇరవై వేలుకే అందించింది.గుడి పుట్టు పూర్వోత్తరాలు విషయం ఒక అర్చక స్వామితో చెప్పగా “మీ గ్రామంలో శ వేణుగోపాలస్వామి రుక్షిణి సమేతంగా వెలవటం మీ గ్రామం అదృష్టం అని చెప్పా లి

అయితే ఎవరో కొంత మంది ఒక పథకం పన్నటం, వాళ్ళ చెప్పినట్లుగా షీ నాన్నగారు శ్రీ కృష్ణ పంచ లోహ విగ్రహం చేయించి నూతిలో వదిలేయటం, మరొకర్తు ఎవరో, “నేను నూతిలో వెలసేను, నన్ను బయటకు తీసి గుడి కట్టించాలని అడగటం, అవన్ని కూడా దైవ సంకల్పం లేకుండా జరగవు” అని ఆ అర్పక స్వామి అన్నారు.

                              1926 సంవత్సరంలో, అంటే సుమారు తొంభై వళ్ళ క్రితం గెద్దనాపల్లిలో “శ్రీ సరస్వతి పుస్తక భాండాగారం” పేరు మీద లైబ్రరీ ఉండేది. ఆ రోజులలో పల్లెటూళ్ళలో లైబ్రరి అంటే ఎరగని రోజులు, ఆ రోజులలో ఉన్న తెలుగు వార్తా పత్రిక ఒకే ఒకటి. దాని పేరు “ఆంధ్రపత్రిక” అప్పటిలో అది రెండు కానులకు పట్టణాలలో మాత్రమే లభ్యమయ్యేదట. ఆ వార్తా పత్రిక గెద్దనాపల్లి లైబ్రరీకి వస్తుంటే చుట్టు పక్క గ్రామాల వాళ్ళు ఆ పత్రిక ద్వారా దేశంలో వార్తలు, ప్రపంచ వార్తలు తెలుసుకోవటాన్ని గెద్దనాపల్లి వస్తుండేవారట. ఆ రోజులలో ఇప్పటిలాక అప్పటికి అప్పుడు వార్తలు అందే ఎలక్ట్రానిక్‌ సౌకర్యాలు ఏమీ లేనందున ఎప్పుడో పదిరోజుల క్రితం జరిగిన వార్తలను ఈ రోజు వార్తలలాగే చదివి సంతృప్తి పడేవారట. అవే విదేశాలకు సంబంధించి వార్తలయితే అవి ఏ నెల క్రితమో జరిగిన వార్తలట. ఎలాగైతేనే గెద్దనాపల్లి పని పట్టుకొని వచ్చి “ఆంధ్రపత్రిక” లో వార్తలు చూడకపోతే దేశం వార్తలుకు గాని ప్రపంచ వార్తలుకు గాని దూరమైపోయినట్లు భావించేవారట. శ్రీ సరస్వతి పుస్తక భాండాగారం (లైబల

            గెద్దనాపల్లిలో స్థాపించటానికీ పంతం వెంకయ్యగారు ఆయన నార్లివ సోదడుడో సూర్యారావు గారు కృషిచేసేరట. ఆ లైబ్రరీలో తెలుగు, ఇంగ్లీషు పుస్తకాలు బీరువాల భద్రసరచియండేవి. ఆ లైబ్రరి నా చిన్ననాటికే శిథిలావస్తకు చేరుకొనియున్నది. దానికీ కారణం వేణు గోపాలస్వామి గుడికి ఆగ్నేయమూ లలో నిర్మించిన ఆ లైబ్రరీ స్థలం చెరువు గర్బం కప్పెంటించి కట్టియున్నందున ఆ బిల్డింగ్‌ ఫునాదులు, గుడి పునాదుల వలె కృంగటం వలన పడిపోవటానికి సిద్ధమైంది. ఆ పడిపోయే బుల్జింగును బెంపరరీగా ఉండేలాగున 1980లో కొప్పన నాయనగారు (ఆ ండలరావు గారు జిల్లా గ్రందాలయాల ఛైర్మన్‌ అయినప్పుడు గెద్దనాపల్లిలో పాత లైబ్రరి విషయం ఆయనకు వివరించి కొత్త లైబ్రరీ బిల్లింగ్‌ కోసం నేను ఆయనను అడగగా వెంటనే నాయనగారు గెద్దనాపల్లి కొత్త లైబ్రరీ నిర్మించడమే కాకుండా చాలా పుస్తకాలు, వార్తా పత్రికలు తెలుగుతో పాటు ఇంగ్లీషు మేగజైన్‌లు గెద్దనాపల్లి లైబ్రరీకు వచ్చే లాగున ఆయన జిల్లా గ్రంధ ఛైర్మన్‌గా మంచి కృషి చేసేరు. పూర్వం అంటే 1933 సంవత్సరమందు సామర్లకోట వైపుగా ప్రయాణం చేయాలి అంటే పుంతలను వెంబడి ప్రత్తిపాడు, సమీపంలో ప్రత్తిపాడు సామర్లకోట రోడ్‌పై ప్రయాణించటానికి వీలు అయ్యేదట. దగ్గరి త్రోవన వెళ్ళాలి అంటే (అది వేసవి కాలంలో) రాజుపాలెం వరకు నడచి గాని, వట్లోంచి బండిపై వెళ్ళవలసి వచ్చేదట. గెద్దనాపల్లి నుంచి ఎర్రవరం వెళ్ళటానికి గాని, కిర్లంపూడి వెళ్ళడానికి గాని ఇప్పటి =

లాగ రోడ్‌లు లేవట. 1925లో మా రెండవ మేనత్తగారి పెళ్ళికి (ఆవిడను ఆవిడ మేనమామ తుమ్మల సత్యంగారికి చేసేరు). కొమ్మిరెడ్డి సూర్యనారాయణ మూర్తి నాయుడు గారు ఆయన సోదరులను పిలవటానికి మా నాన్నగారిని కాకినాడ పంపించేరట. గెద్దనాపల్లి ఎలా రావాలి, కారు మీద రావటానికి వీలు పడుతుందా అని కొమ్మిరెడ్డి సూర్యనారాయణమూర్తి నాయుడు గారు మా నాన్నగారిని అడుగగా

మీరు రాజుపాలెం వరకు కారుపై వచ్చి అక్కడ నుంచి బళ్ళపై గెద్దనాపల్లి వల వస్తుంది మీకోసం అక్కడకు (రాజుపాలెం) బళ్లు వస్తాయని చెప్పి అలాగే పెళ్ళిరోబ్రున కొమ్మిరెడ్డి వారు గెద్దనాపల్లి రావటానికి బళ్ళు ఏర్పాటు చేసేరట. బళ్ళలో గెద్దన్యల్లి వచ్చేటప్పుడు కొమ్మిరెడ్డి సూర్యనారాయణ మూర్తి నాయుడు గారు “ఇప్పుడు వేసవికాలం కాబట్టి ఏటి ఇసుకలో ప్రయాణించేయాటానికి వీలు అవుచున్నది, మం వర్షాకాలంలో ఏటిలో నీరు ప్రవహిస్తూంటే ఎలా ప్రయాణం?" అని అడిగితే మా నాన్నగారు వుంత మార్గాన వ్రత్తిపాడు వెళ్ళవలనీ వన్తుందని చెవ్పగా, సూర్యనారాయణమూర్తి నాయుడు గారు అప్పటి జిల్లా బోర్డు చైర్మన్‌ దురుసేటి శేషిరి రావు పంతులు గారితో చెప్పి కిర్లంపూడి నుంచి గెద్దనాపల్లి రోడ్‌కు సేంక్షన్‌ చేయుటకు రోడ్డు ప్లాన్‌ తయారు చేసి ఛైర్మన్‌ గారికి ఇమ్మని సూర్యనారాయణమూర్తి నాయుడు గారు మా నాన్నగారితో చెప్పగా మా నాన్నగారు రోడ్‌ ప్లాన్‌ వేసి ఛైర్మన్‌కు ఇవ్వగా నేటి రోడ్‌ గెద్దనాపల్లి కిర్లంపూడి, గెద్దనాపలి& ఎర్రవరం రోడ్‌ 1933 కాలంలో నిర్మించటం జరిగిందట. అప్పటిలో రవాణా సౌకర్యాలు లారీలు, ట్రాక్టర్‌లు లేనందున బళ్ళ సాయంతో కంకర అవి తోలటంతో రోడ్‌ పూర్తి అయ్యేసరికి సుమారు నాల్లు సంవత్సరాలు పట్టిందట. రోడ్‌ ప్లాన్‌, మొదటి ప్లాన్‌ ప్రకారం మా నాన్నగారు వేసినది గెద్దనాపల్లి నుంచి ఇప్పటిలాగ మలుపులు లేకుండా తిన్నగా చిల్లంగి మేదర పేటకు చేరుకొనే వేస్తే అక్కడ భూములు కలిగియున్న బ్రహ్మాణులు (సత్యవోలు వారు) అది 1928 సంవత్సరం వెంకయ్యగారి వద్దకు వచ్చి మీ పెద్ద దొరయ్యగారు వేసే రోడ్‌ ప్లాన్‌ మా భూములలోంచి వెళుతుంది. అలా చేస్తే మా భూములు దెబ్బయిపోతాయి అని చెప్పగా వెంకయ్యగారు మా నాన్నగారితో ఆ బ్రాహ్మణులను ఇబ్బంది పెట్టటం ఎందుక పుంత మార్గాలనే రోడ్‌ ప్లాన్‌ చేయించు అనగా మా నాన్నగారి ప్లాన్‌ మార్చి పుంతల మార్గాన ఇటు ఎర్రవరానికి, అటు కిర్లంపూడికి వెళ్ళేలాగున ప్లాన్‌ మార్చేరట.ఫుంతల వెంబడి రోడ్లు వేయటం వలనే కిర్లంపూడి రోడ్‌, ఎర్రవరం రోడ్‌ చాలా మలుపులు తిరగవలసి వచ్చిందట. 1928లో ప్రారంభించిన రోడ్‌ పనులు పంచవర్న ప్రణాళికలాక పూర్తి అయి రోడ్‌ రూపం రావటానికి అయిదు సంవత్సరాలు పూర్తి అయి 1933కు ఉపయోగంలోకి వచ్చిందిట.

                  గెద్దనాపల్లి ఒక పల్లెటూరు అయినా అయిదుగురు ముఖ్యమంత్రులు దర్శించిన పల్లెటూరు. 1952లో పంతం వారు ఇచ్చిన విందులకు కాళా వెంకటరావు, చంద్రమౌళి అప్పటి మద్రాస్‌ ప్రెసిడెన్సీ మంత్రులుగా గెద్దనాపల్లి వచ్చిన మొదటి మంత్రులు. 1960లో అప్పటి రాష్ట్ర మంత్రి అయిన మల్లిపూడి పళ్ళంరాజు గారు అబ్బాయి సంజీవరావు గారికి పంతం కామరాజు (మా చిన్నాన్స) గారి రెండవ కుమార్తే రాజేశ్వరితో వివాహం జరిపినప్పుడు పళ్ళంరాజుగారు ఆహ్వానం మేరకు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన దామోదరం సంజీవయ్య ఆయన మంత్రి వర్గం సభ్యులు అంతా

గెద్దనాపల్లి రావటం, పళ్ళంరాజు గారు కమ్యూనిస్టు పార్టీలో ఉన్న పంతం పద్మనాభం గారిని కాంగ్రెస్‌ పార్టీలో చేర్చటం, ఆ తర్వాత పధ్మనాభం గారు ఎమ్‌.ఎల్‌.ఏ.. అవ్వటం, ఆ తర్వాత మంత్రి అవ్వటం అందరికి తెలిసిన విషయమే అయినా అయిదుగురు రాష్ట్ర ముఖ్యమంత్రులు గెద్దనావల్లి వచ్చినట్లు చాలా మందికి తెలియకపోవచ్చు. ఒక పల్లెటూరికి ఇంతమంది ముఖ్యమంత్రులు రావటం చాలా అరుదైన విషయం. ఈ ముఖ్యమంత్రులు ఎవరో తెలుసుకొందాం. ముందు రాసినట్లు మళ్ళిపూడి సంజీవరావు గారి వివాహం కు అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యతో సహా ఆయన మంత్రి వర్గం అందరూ రావటం జరిగింది. పంతం పధ్మనాభం గారు, ఎమ్‌.ఎల్‌.ఏ గా నీలం సంజీవ రెడ్డి (అప్పటి ముఖ్యమంత్రి తనుఇచ్చే విందుకు గెద్దనాపల్లి ఆహ్వానించగా సంజీవ రెడ్డి, దామోదరం సంజీవయ్య తర్వాత గెద్దనాపల్లి వచ్చిన రెండవ ముఖ్యమంత్రి అయ్యేరు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన మర్రి చెన్నారెడ్డి పద్మనాభం గారు ఇ చ్చిన విందుక్స గెద్దనాపల్లి రావటం, ఆ తర్వాత ముఖ్యమంత్రి జలగం ఎెంగళరావున్స పద్మనాభ గారు ఇచ్చిన విందుకు గెద్దనాపల్లి రావటం పద్మనాభం గారు రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రిగా శ్రీ వేణుగోపాలస్వామి గుడి సంప్రోక్ష సందర్భంగా అప్పటి మృ) సమంత నేదురుమల్లి జనార్ధనరెడ్డి గెద్దనావల్లి రావటంతో గెద్దనావల్లి ఎప్పుడైత్రశ్లల్ని అయిదుగురు ముఖ్యమంత్రులు రావటం జరిగింది. కొణిజేటి రోశయ్యగారు పంతం

పద్మనాభం గారిని కలవటానికి గెద్దనాపల్లి రెండు సార్లు రావటం జరిగింది. అయితే ఆయన అప్పటికి ముఖ్యమంత్రి కాదు, రోశయ్యగారు కేవలం ఎమ్‌.ఎల్‌.ఏ. గానే గెద్దనాపల్లి వచ్చారు. ఆయన ముఖ్యమంత్రి కాకముందే పద్మనాభం గారు పోవటం జరిగింది.

                      పంతం పద్మనాభం గారు ప్రతి సంవత్సరం ([1960-80లలో) జరిపించే నాటకాలకు గెద్దనాపల్లి రాష్ట్ర నలు మూలలనుంచి గెద్దనాపల్లి వస్తూ ఉండేవారు. అప్పుడు పద్మనాభం గారు ఇచ్చే ఆతిద్యానికి, విందులకు వచ్చే ఆహుతులకు గెద్దనాపల్లికి ఒక మరువరాని జ్ఞాపకంగా ఉండిపోవటంతో ఇప్పటికి వాళ్ళు పంతం పద్మనాభం నాటక కళా పరిషత్‌ గురించి చెపుతుంటారట. ఆయన పోయిన తరువాత కాకినాడలో ఆయన అభిమానులు ఆయన పేరిట ప్రతి సంవత్సరం నాటకాలు జరపటం జరుగుచున్నది. ఒకసారి నాకు వడ్గమూరుకు చెందిన ఒక ఆసామి ప్రయాణంలో కలిసేడు. ఆ ఆసామి పంతం పద్మనాభం గారి వంటి మనిషిని మరల చూడగలమా అంటూ ఆయనను వేనోళ్ళ పొగిడేడు. “ఈ రోజు రాజకీయంలో ఉన్న వాళ్ళు పదవులు అడ్డు పెట్టుకొని సంపాదించినవాళ్ళే. ఆయన రాజకీయాలలో ఉoడి తన ఆస్థిని, సంపదను తగలబెట్టుకొన్న మనిషి, అని పద్మనాభం గారిని పొగిడేడు.

నిజమే, అలాంటి గొప్ప వ్యక్తి కాబట్టే పంతం పధ్మనాభం గారికి కాకినాడలో మంచి కూడలిలో ఆయన జ్ఞాపకార్ధం ఒక విగ్రహాన్ని నిర్మించేరు.


SOURCE : ఇది పంతం వారి చరిత్ర పుస్తకం నుండి తీసుకున్నది

                                                                                                            Polamarasetti Ganesh,

                                                                                                                  (Geddanapalli)

  1. ^ Ganesh, Polamarasetti. "Geddanapalli". Ganesh. {{cite news}}: |access-date= requires |url= (help); Check date values in: |accessdate= (help)