User:Santhosh0257
కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ పరిధిలోని మానకొండూర్‌కు చెందిన జి.వి.రామకృష్ణారావు బీకాం ఎల్‌ఎల్‌బీ చదివారు. న్యాయవాదిగా పని చేస్తూ వ్యవసాయ వృత్తిలో ఉంటున్నారు. 2001 సంవత్సరంలో తెరాసలో చేరి కెప్టెన్ లక్ష్మికాంతరావు నాయకత్వంలో పార్టీలో చురుకుగా పని చేస్తున్నారు. 2001లో తెరాస సింహగర్జన సమావేశానికి సమన్వయకర్తగా పనిచేశారు. 2001-02 వరకు మానకొండూర్ మండల పార్టీ ఇన్‌ఛార్జిగా, 2002-06 వరకు యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా, 2006-11 వరకు తెరాస యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా, 2011-15 వరకు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొనసాగారు. పార్టీ తరఫున పల్లెబాట కార్యక్రమాలకు ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. ఉప ఎన్నికల సమయంలో పార్టీ తరఫున ఇన్‌ఛార్జిగా పని చేశారు. 2013లో ఆదిలాబాద్ జిల్లా శిక్షణ తరగతులకు ఇన్‌ఛార్జిగా ఉన్నారు. ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, స్వామిగౌడ్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, రాజ్యసభ ఎంపీ కెప్టెన్ లక్ష్మికాంతరావుకు ఎన్నికల ఏజెంటుగా పని చేశారు. 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో మానకొండూర్ నియోజకవర్గానికి పార్టీ తరపున ఇన్‌ఛార్జిగా పని చేశారు.కరీంనగర్ నగరంతో పాటు కొత్తపల్లి మండలంలోని 14, కరీంనగర్ రూరల్ 14 గ్రామాలు, మానకొండూర్ మండలంలోని 9, తిమ్మాపూర్ మండలంలోని 9 గ్రామాలు, గన్నేరువరం మండలంలోని 15 గ్రామాలు, రామడుగు మండలంలోని 6 గ్రామాలతో నూతనంగా ఏర్పడిన శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ(సుడా) కమిటీకి మొదటి ఛైర్మెన్ గా కొనసాగుతున్నారు.