Jump to content

User:Sreeramoju haragopal

From Wikipedia, the free encyclopedia

నేను శ్రీరామోజు హరగోపాల్.మాది నల్లగొండ జిల్లా ఆలేరు(మండలం).అమ్మా,నాన్నలు వరలక్ష్మీ,విశ్వనాదం. ఎం.ఏ.తెలుగు,ఎం.ఇడి. నా చదువు. గజిటెడ్ హెడ్మాష్టరుగా పనిచేసి 2013లో రిటైరైనాను. ఉపాధ్యాయ ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేసాను. అనేక సాహిత్యసంస్థలతో కలిసి పనిచేస్తున్నాను. నేను రాసిన కవిత్వాన్ని 1991లో మట్టిపొత్తిళ్ళు,2006లో మూాలకం కవితాసంపుటులుగా ప్రచురించాను. 1987లో ఆలేరులో రచనసాహితీకళావేదిక అనే సాహిత్యసంస్థను స్థాపించి అనేక సాహిత్యకార్యక్రమాలను నిర్వహించాను.అనేక పుస్తకాలను సంస్థ తరపున ప్రచురించాను.నెలా,నెలా రచన కార్యక్రమాన్ని చాలా సంవత్సరాలపాటు నిర్వహించాను. 1994లో బాలచంద్రిక అనే పిల్లలసంస్థను ఏర్పాటుచేసి ప్రతిసంవత్సరం పిల్లలకు సాహిత్య,సాంస్కృతిక,క్రీడా,బౌద్ధిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. పుస్తకసమీక్షలు,సాహిత్యవ్యాసాలు,గల్పికలు,నాటికలు,కథలు,పాటలు రాసాను.నా పాటల్ని గాలి అలలమీద నీ నవ్వులు అనే పాటల ఆల్బంగా తెచ్చాను. చరిత్రమీద ఆసక్తితో తెలంగాణచరిత్రను పరిశోధన చేస్తున్నాను.నాతో కలిసివచ్చిన మిత్రులు,మార్గదర్వకులతో కొత్త తెలంగాణచరిత్రబృందంగా ఏర్పడి ప్రస్తుతం తెలంగాణా అంతట పర్యటిస్తున్నాం.ఆదిమానవసంస్కృతి,నాగరికతలు,గ్రామాలచరిత్ర,శాసనపరిష్కరణ,స్థానికచరిత్రల గురించి అన్వేషణ చేస్తున్నాం.