Jump to content

User:Vasuvidela

From Wikipedia, the free encyclopedia

అరుణాచల గిరి ప్రదక్షిణ మోక్షమార్గం ( ఇడుకుపిల్లియార్ టెంపుల్)


తమిళనాడు రాష్ట్రంలో ఉన్న అరుణాలంలో గిరి ప్రదక్షిణకు ఎక్కవ ప్రాధాన్యత ఉంటుంది. గిరి ప్రదక్షిణలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ మార్గంలో ఉన్న మొత్తం ఎనిమిది లింగాలు దర్శించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ మార్గంలో కుభేర లింగం దాటి ముందుకు వెళితే మనకు కుడివైపున ఇడుకు పిల్లియార్ మందిరం ( మోక్షమార్గం) కనిపిస్తుంది. ఈ ఆలయంలో వెనుక వైపు నుండి ప్రవేశించి ముందుకు రావడానికి పడుకుని పాకుకుంటూ రావాల్సి ఉంటుంది. ఇలా రావడం వెనుక ఒక ప్రత్యేకత ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో వెనుక వైపు మనం ప్రవేశించేందుకు వీలుగా పెద్దగా ఉంటుంది. అక్కడినుండి సన్నగా మారిపోతుంది. ఇదా చాలా మంది త్రిల్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ మార్గంలో స్వామి వారిని స్మరించుకుంటూ ముందుకు చేరుకుంటే మహిళలకు గర్భశ్రావాల నుండి విముక్తి కలుగుతుందని, అలానే నరాలకు సంబంధించిన వ్యాధులు వచ్చినా ఇడుకు పిల్లార్ దగ్గరకు వెళితే లాభాలు వస్తాయని విశ్వాసం అంతే కాకుండా అధికతుచ్ సిద్ధర్ ఈ ఆలయంలో మూడు యంత్రాలను ప్రతిష్టించాడని, అక్కడ పాకుతూ ఉండగా సిద్ధుడు ఏర్పాటు చేసిన యంత్రాలు శరీరంపై పడటం ద్వారా ఆ యంత్రాల నుండి వెలువడే శక్తి చేయి మరియు కాళ్ళ నొప్పులు, కడుపునొప్పి ఏదైనా నయం కాని వ్యాధిని నయం చేస్తుందని నమ్ముతారు.

అశుభం, ఫీలీ, శూన్యం మొదలైనవాటితో బాధపడేవారు ఈ మార్గంలోకి ప్రవేశిస్తే వాటి నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. ఈ ఆలయంలో సరళరేఖలో లేని మూడు ద్వారాలు ఉన్నాయి. వెనుక ద్వారం గుండా లోపలికి వంగి పాకడం, 2వ ద్వారం గుండా ప్రవేశించి ముందు ద్వారం గుండా బయటకు రావడం.. ఇలా వచ్చి ఇడుక్కుపిళ్లైయార్‌ను పూజిస్తే సంతానం కలుగుతుందని విశ్వాసం. అలాగే ఈ ఆలయ ప్రవేశం వల్ల తలనొప్పి, చేతబడి, శరీర నొప్పులు, ఇతర రుగ్మతలు నయమవుతాయని భక్తుల అచంచల విశ్వాసం. అంతేకాకుండా గిరి ప్రదిక్షిణకు వచ్చిన వారికి కాళ్ళనొప్పి తగ్గుతుందని నమ్ముతారు. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ: వీడియో వీక్షించేందుకు ఇక్కడ ఉన్న లింకు ద్వారా చూడవచ్చు https://youtu.be/iWmhTJbTUvM

వ్యాసం : వాసు విడేల